6 September, 2026 | 11:55 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ సోదరుడి కుమార్తె వివాహం

27-08-2026 | 11:14pm

ముకరంపుర,(విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  అన్నయ్య బండి శ్రవణ్ కుమార్ - సరిత దంపతుల కుమార్తె వివాహ మహోత్సవం గురువారం  వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన నూతన వధూవరులు సంజన - రజినీకాంత్ లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు