చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి
11-06-2024 01:54 PM
హైదరాబాద్: 2024 జరిగిన ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ఘనవిజయం సాధించింది. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు స్టేట్ గెస్ట్ గా హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవికి చంద్రబాబు ఆహ్వానం పంపారు. దీంతో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు చిరంజీవి విజయవాడకు బయలుదేరనున్నారు.






