బ్యారేజీల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పాయి: జస్టిస్ పీసీ ఘోష్
11-06-2024 03:50 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న పీసీ ఘోష్ విచారణ
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతోంది. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపింది. లోపం ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎవరి ప్రమేయమైనా ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని పీసీ ఘోష్ స్పష్టం చేశారు. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారిస్తున్నామన్నారు. అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఇంజినీర్లందరూ జూన్ 25లోపు నివేదిక ఇవ్వాలని చెప్పామని తెలిపారు. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయని చెప్పారు.






