18 April, 2026 | 4:30 AM

తుర్కియేకు బైబై!

16-05-2025 01:16 AM
  1. ఆ దేశ విద్యాసంస్థలతో ఒప్పందాలను రద్దుచేసుకుంటున్న భారత వర్సిటీలు

జేఎన్‌యూ బాటలోనే జేఎంఐ, మౌలానా అజాద్ ఉర్దూ వర్సిటీ

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతు న్న నేపథ్యంలో తుర్కియే దేశం పాకిస్థాన్‌కు మద్దతు తెలపడంతో ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. తాజాగా తుర్కియే దేశం తో భారతీయ యూనివర్సిటీలూ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇప్పటికే జవ హర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ ఢిల్లీ) తుర్కియేలోని ఇనోను యూనివర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

ఇదేబాటలో మరికొన్ని యూనివర్సిటీలు నడుస్తు న్నాయి. జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐైఢిల్లీ) యూనివర్సిటీ తుర్కియేలోని విద్యాసంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను తక్షణమే రద్దు చేసుకున్నట్లు ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించింది.

అంతేకాకుండా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూ) కూడా తుర్కియేకు చెందిన యూనస్ ఎమ్రే ఇన్‌స్టిట్యూట్‌తో కుదుర్చుకున్న ఎంవోయూను తక్షణమే రద్దుచేస్తున్నట్లు ప్రకటిం చింది. ఇండో ఉద్రికత్తల నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు తుర్కియే మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్సిటీ అధికారు లు తెలిపారు.

తుర్కియే భాషలో డిప్లొమాను అందించేందుకుగానూ ఐదు సం వత్సరాల కాలానికి ఈ ఎంవోయూను 2024 జనవరిలో ఉర్దూ వర్సిటీ కుదుర్చుకున్నట్లుగా వెల్లడించింది. ఆయా వర్సిటీల ఒప్పందాల్లో అధ్యాప కులు, విద్యార్థుల మార్పిడులు కూడా ఉన్నాయి. ఇవన్నీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.