ప్రజల ముంగిటకే పాలన
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మే 2 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని మధురనగర్లో ఉన్న సాగి రామకృష్ణ రాజు కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ హాజరయ్యారు. షేక్పేట్ ఎమ్మార్వో అనిత రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర నివేదికలను సమర్పించారు.
ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడు తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం పాలకులం కాదు.. సేవకులం అనే నినాదంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
మార్చి 6 నుంచి అమలవుతున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా నగర అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. రాబోయే రోజుల్లో కొత్త పెన్ష న్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వం టి కీలక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం రాగి జావా బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






