కర్మన్‌ఘాట్‌లో ప్రముఖుల పూజలు
స్వామివారిని దర్శించుకున్న క్రికెటర్ అభిషేక్ శర్మ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి
ఎల్బీనగర్, మే 2 (విజయక్రాంతి): ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో శనివారం ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రికెటర్ అభిషేక్ శర్మ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ స్వామివారిని దర్శించుకుని జట్టు విజయానికి ప్రార్థనలు చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం కీలక పోరుకు సిద్ధమవుతోంది. అలాగే, ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేదపండితులు, అర్చకులు వేదమంత్రములతో ఆశీర్వదించారు.






