మోకిల అసైన్డ్ భూములపై ‘ప్రభుత్వ’ బోర్డు
కబ్జాదారులకు బిగ్ షాక్
రంగారెడ్డి /శంకర్ పల్లి, జులై 29(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిళ్ల గ్రామంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములపై ‘విజయ క్రాంతి’లో వచ్చిన వరుస ప్రత్యేక క థనాలకు జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. రాజకీయనాయకులు, అధికార-ప్రతిపక్షాల అండదండలతో సాగిన భూ అ క్రమాలపై వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వ చ్చింది.
కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్‌పల్లి తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు మోకి లలోని సర్వే నంబర్ 31 అసైన్డ్ భూమిని పరిశీలించారు. అనంతరం అది ‘ప్రభుత్వ భూ మి‘ అని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. అధికారుల చర్యతో ఆ భూములను నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన కొందరు నేతలకు కోలుకోలేని షాక్ తగిలింది.
గ్రామస్తుల హర్షం
అధికారులు బోర్డు ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గతంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన విధంగా సర్వే నంబర్ 31లోని మిగులు భూమిని ప్రజా అవసరాల నిమిత్తం (ప్రభుత్వ ఆసుపత్రి లేదా మార్కెట్ యార్డ్ నిర్మాణానికి) కేటాయించాలని డెవలపర్లు, గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోని మరికొన్ని ఆక్రమిత ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.






