30 July, 2026 | 1:33 AM

నేడు మెగా ఎగుమతి ప్రోత్సాహక సదస్సు

30-07-2026 01:23 AM

కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి, జులై 28(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఎగుమతులనుప్రోత్సహించడంతో పాటు స్థానిక పరిశ్రమల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసే లక్ష్యంతో ’డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్ కింద మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఐఏఎస్ తెలిపారు. ఈ సదస్సు ఈ నెల 30వ తేదీ (గురువారం) ఉదయం 10:00 గంటలకు కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  జరగనుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్  సమన్వయంతో జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ  కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ శాఖ,  నాబార్డ్  ఈసీజీసీ , ఇండియా పోస్ట్ వంటి వివిధ ఎగుమతి ప్రోత్సాహక సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు.ఎగుమతి విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఆర్థిక సహాయం మరియు ఈ-కామర్స్ ద్వారా వ్యాపారాన్ని ఎలా విస్తరించాలనే విషయాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తారు.

కొత్తగా ఎగుమతులు ప్రారంభించాలనుకునే వారికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్  పొందే విధానంపై మార్గదర్శకాలతో పాటు, అవసరమైన పత్రాలతో వచ్చే వారికి దరఖాస్తు ప్రక్రియలో నేరుగా సహాయం అందిస్తారు.జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు, స్టార్టప్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మహిళా మరియు యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.