20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర

20-07-2026 12:00 AM

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు

హనుమకొండ,జులై 19 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ఫీజు రి యంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కు ట్ర పన్నుతోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఆరోపించారు. ఏబీవీపీ కాకతీయ  యూనివర్సిటీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్ ఆధ్వ ర్యంలో జాఫర్ నిజాం సెమినార్ హాల్లో స్టడీ సర్కిల్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పేద, బడు గు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత వి ద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశం తో తీసుకొచ్చిన ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని, దీనిని ఏబీవీపీ తీ వ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

ఫీజు రీ యింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్ర యించినప్పుడు, ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని  హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే ‘విద్యార్థుల ద గ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని’ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చ ర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.

ఈ పథకం ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా వంటి  కోర్సులు పూర్తిచేసి దేశ,విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు .విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంబాల కిరణ్, వరంగల్ విభాగ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పృధ్విరాజ్, మహేష్,వినోద్, పవన్, శివ, పవన్ కళ్యాణ్, వీక్షిత, శ్రీవన్య, సాయి, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.