20 July, 2026 | 5:37 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

మధ్యాహ్న భోజనంలో పురుగులు

20-07-2026 12:00 AM
  1. కృష్ణాజివాడి పాఠశాలలో నాణ్యతలేని భోజనం
  2. విద్యా కమిటీ సమావేశంలో తల్లిదండ్రుల ఆవేదన

తాడ్వాయి, జూలై, 19( విజయ క్రాంతి ): తమ పిల్లలకు పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు నాణ్యతలేని భోజనాన్ని అందిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో పాఠశాలలో పిల్ల లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లా డుతూ... ప్రతిరోజు అన్నంలో పురుగులు వస్తున్నాయని తమ పిల్లలు చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. అన్నంలో పురుగులతో పాటు ఇసుక సైతం వస్తుందని తెలిపారు.దీంతో తమ పిల్లలు మధ్యాహ్న భోజనం తినకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఇప్పటికైనా ఉపాధ్యాయులు స్పందించి వెంటనే అన్నంలో పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి భోజనం చేయాలని తల్లిదండ్రులు కోరారు. విద్యార్థులు భోజనం చేసే చోట డైనింగ్ లేకపోవడంతో భోజనం చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.  ఈ విషయమై పాఠశాల ఇన్చార్జి గిర్మబోయి మాట్లాడుతూ... బియ్యం లోనే పురుగులు వస్తున్నాయని తెలిపారు.

గోదాం నుంచి వచ్చే బియ్యంలోనే పురుగులు ఉంటున్నాయన్నారు.దీనిపై జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.ఇంటి వద్ద విద్యార్థులను చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ఆయన సూచిం చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు హేమలత,ఉపాధ్యాయులు శ్వేత, శ్రీహరి, రాజిరెడ్డి, హేమంత్ కుమార్,రాజు తదితరులు పాల్గొన్నారు.