కాళోజివాడిలో రాష్ట్ర అధికారుల బృందం
సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై తనిఖీలు
తాడ్వాయి, జూలై, 19( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామంలో రాష్ట్ర అధికారుల బృం దం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై చర్చించింది.ప్రణాళిక నివేదికను తనిఖీ చేసింది.ఈ సందర్భంగా రాష్ట్ర డిడి విజిలెన్స్ అధికారి అయిన ఆర్ వి సుబ్రహ్మ ణ్యం ప్రోగ్రాం మానిటరింగ్ అధికారిగా వి చ్చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి మాట్లాడుతూ... కాళోజి వాడి గ్రామాన్ని గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు.
తాను జిల్లాలో కాలోజీ వాడి గ్రామాన్ని ఎంపిక చేసుకుని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఎలా తయారు చేశారు అనే విషయమై తనిఖీ చే స్తున్నట్లు తెలిపారు.ఇందులో ఏవైనా తప్పొప్పులు ఉంటే సరి చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికలో భాగంగా గ్రామంలో మూ డు సంవత్సరాల పాటు అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు. అందుకోసం మూడు సంవత్సరాల ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.మూడు సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి పనులకు నివే దికలు పొందుపరుస్తున్నట్లు తెలిపారు.
గ్రా మపంచాయతీ లో ఉన్న జనాభా, పాఠశాల వివరాలు, అంగన్ వాడి కేంద్రాల వివరాలు, గ్రామంలో ఉన్న మౌలిక సౌకర్యాలపై నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం వివరా లు, తాగునీరు ట్యాంకుల వివరాలు, పైపులైన్ల వివరాలు, మిషన్ భగీరథ వివరాలు అన్నింటిపై సమగ్ర నివేదిక తయారు చేసినట్లు ఆయన వివరించారు.కాళోజివాడి గ్రామాన్ని మోడ ల్ గ్రామంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు.
గ్రామపం చాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు అన్ని గ్రామాల్లో రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి విషయం పై కూలంకుషంగా చర్చించి నివేదికలో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో డి ఆర్ డి ఓ దా మోదర్ రెడ్డి, సీఈ ఓ చందర్ నాయక్, డిపిఓ మురళి, పంచాయతీరాజ్ ఈఈ దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేష్, ఎంపీడీవో భరత్ కుమార్, ఎంపీఓ సవిత రెడ్డి, సాయికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.






