calender_icon.png 2 February, 2026 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతన వెతలు తీరేలా!

02-02-2026 12:01:14 AM

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పై ప్రభుత్వం ఫోకస్

అక్రమాలకు చెక్ పెట్టేలా చర్యలు

ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లోకి ఉద్యోగుల వివరాలు

ఏప్రిల్ నుంచి వారి అకౌంట్లలోకే వేతనాలు?

సంగారెడ్డి, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇక వేతన ఇక్కట్లు తొలగిపోనున్నట్ల తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి వారి బ్యాంకు ఖాతాలకే నేరు గా వేతనాలు జమ చేసేలా ప్రభుత్వం చర్య లు చేపడుతోంది. రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఉండే ఇంటిగ్రేడేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎఫ్‌ఎస్) పోర్టల్లో వీరి వివరాల నమోదు ప్రక్రియ ఇటీవల చేపట్టింది. ఒకవేళ ఇది అమలైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో హెచ్ వోడీలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆ ఏజెన్సీలు పాల్పడుతున్న అక్రమాలకు చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్లో నమోదు..

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆయా శాఖల హెచ్వోడీలు, ఏజెన్సీలు అం దించే వేతనాల్లో కోత విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వేతనాలు సై తం మూడు నుంచి ఆరు నెలల వరకు పెం డింగ్లో పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా ఉద్యోగులు ఏళ్లుగా పో రాటం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో వారు చేపట్టిన ఆందోళనలతో ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి పూర్తి వివరాలను ఇటీవల ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసింది. తద్వారా ఈ ఉద్యోగులకు డైరెక్టుగా వారి అకౌంట్లో ప్రతి నెల జీతం జమ చేసేలా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.

అక్రమాలకు చెక్ పడేనా ?

ప్రధానంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆయా ఏజెన్సీలు ప్రతినెలా వారికి చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోత పెట్టి ఇస్తున్నారనే ఆరోపణలు ముందునుంచి ఉన్నాయి. అంతే కాకుండా వారికి సంబంధించి పీఎఫ్, ఈఎస్‌ఐఐ చెల్లించకపోవడంతో భద్రత లేకుండా పోతుందని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ఏజెన్సీలు జీఎస్టీ కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇటీవల ఐఎఫ్‌ఎంఎస్ లో వివరాలు నమోదు చేసినప్పుడు ఔట్సోర్సింగ్ ప్రక్రియలో ఒకే వ్యక్తి పలు పోస్టుల్లో ఉన్నట్టుగా రాష్ట్ర పరిధిలో తేలింది.

ఐఎఫ్‌ఎంఎస్లో ఆధార్, ఫోన్ నం బర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేయడంతో ఇలాంటివి వెలుగులోకి వచ్చా యి. ఆసలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వారు ఎవరు, ప్రస్తుతం పనిచేసు న్నాడా.. లేదా తొలగించిన పక్షంలో ఆ వివరాలు ప్రభుత్వ శాఖలకు అందజేస్తున్నారా.. మళ్లీ ఆ పోస్టులో అనుమతి తీసుకొనే వేరొకరిని నియమిస్తున్నారా.. ఇలాంటి అనేక అక్రమాలు ఈ ప్రక్రియలో ప్రభుత్వం దృ ష్టికి వచ్చాయి. ఒక ఉద్యోగి వెళ్లిపోతే ఆ స్థానంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమ పద్ధతుల్లో వేరొకరిని నియమించడం వంటివి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలలో నిత్యం జరిగే తంతు. దీంతోనే ప్రభుత్వం ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.