calender_icon.png 2 February, 2026 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉజ్వల ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

02-02-2026 12:02:58 AM

సిద్దిపేట, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద బీజేవైఎం రాష్ట్ర నాయకుడు తాటికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణ పరిధిలోని 1వ వార్డు లింగరెడిపల్లిలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలకు గ్యాస్ సిలిండర్లతో పాటు పైపు, రెగ్యులేటర్లను కూడా ఉచితంగా అందించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాల మహిళలకు స్వచ్ఛమైన ఇంధనం అందించి ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్య మన్నారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇంధన సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజనను ప్రవే శపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.