calender_icon.png 2 February, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్

02-02-2026 12:00:00 AM

కేసీఆర్‌కు నోటీసులు ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

కేసీఆర్‌ని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండమే

మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్

మెదక్, ఫిబ్రవరి 1(విజయ క్రాంతి): సీఎం రేవంత్రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ పోలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగమే తల తోక లేని ఫోన్ ట్యాపింగ్ కేసు అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలోనే కేసీఆర్కు సిట్ పేరుతో నోటీసులు జారీ చేశారని తెలిపారు. చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి,దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని అన్నారు. రేవంత్రెడ్డి ఎన్ని విష రాజకీయాలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నేత కేసీఆర్ అని స్పష్టంచేశారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండంలా మారి ఆ నిప్పుల సెగకు కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుందన్నారు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడడంతో యూరియా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలి, కానీ మెదక్లో బిఆర్‌ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి నుంచి గుండాలని రప్పించి వార్డులో ప్రచారం చేయిస్తూ మా పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.

ప్రజాస్వామ్య బద్దం గా, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చూడాలని చెప్పారు. ఐద వ వార్డ్ లో మామిళ్ళ ఆంజనేయులు, నా యకులు శ్రీనివాస్ ప్రచారానికి వెళితే ... మ ల్కాజిగిరి నుంచి వచ్చిన గుండాలు కారులో వెంబడించి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో మెద క్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌ డ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, నాయకులు జుబెర్ అహ్మద్, గౌస్ ఖురేషి, సున్నం నరేష్ శంకర్, మహిళా నా యకులరాలు,తదితరులు పాల్గొన్నారు.