18 June, 2026 | 1:44 AM

ప్రభుత్వ భూములను కాపాడాలి

18-06-2026 12:00 AM
  1. భూమాఫియాపై ఉక్కుపాదం మోపాలి
  2. ఎంపీ ఈటల రాజేందర్

సికింద్రాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): కొందరు భూ కబ్జాదారులు, పైరవీకారులు, అవినీతి అధికారులతో కుమ్మక్కై వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు ఆస్తులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల అన్నారు. హైదరాబాద్ నగరంలో పేదవాడు జీవించే పరిస్థితి రోజురోజుకు కష్టతరమవుతోందని, ఇల్లు నిర్మించుకోవడానికి కనీస స్థలం కూడా అందుబాటులో లేకుండా పోతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేస్తూ కంటోన్మెంట్ పరిధిలోని సర్వే నంబర్లు 57/1, 157/1 భూముల సమస్యపై స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.

అనంతరం అనంతరం బోర్డ్ నామినేటెడ్ సభ్యు రాలు భానుక నర్మదా మల్లికార్జున్ తో కలిసి ఈటల రాజేందర్ మాట్లాడుతూ 7080 ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేదలు ఆనాడు డిమాండ్ లేని ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవనం ప్రారంభించారని, కానీ నేడు పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 20 గజాల స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజా అవసరాల కోసం కూడా భూములు అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ భూముల ఆక్రమణలేనని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

కొందరు భూ కబ్జాదారులు, పైరవీకారులు, అవినీతి అధికారులతో కుమ్మక్కై వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూ ములను ప్రైవేటు ఆస్తులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ ఈటెల అన్నారు. షంషీగూడ ఎల్లమ్మబండలోని వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవు తున్నాయని, ఒకప్పుడు పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములనే నేడు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించే పరిస్థితి ఏర్పడిందని రాజేందర్ అన్నారు.

అలాగే బాలా నగర్‌తిరుమలగిరి గ్రామాల మధ్య ఉన్న సుమారు 8 ఎకరాల భూమిని కూడా కొం దరు భూమాఫియా వ్యక్తులు ప్రైవేటు భూమిగా చిత్రీకరించారని విమర్శించారు. సర్వే నంబర్లు 57/1, 157/1లో తరతరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు అన్యాయమని, తాము ప్రజల పక్షాన నిలబడి అలాంటి ప్రయత్నాల ను అడ్డుకున్నామని ఈటెల తెలిపారు. గత 25 నుంచి 30 ఏళ్లుగా రికార్డుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపించే కుట్రలు జరిగాయని ఆరోపించారు.

ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలు, పాఠ శాలలు, ఆస్పత్రులు, పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి అని ఈటెల రాజేందర్ తెలియ జేశారు. భూమాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల పన్నులతో జీతాలు పొందుతున్న అధికారులు ప్రజల పక్షాన పనిచేయాలని, ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని ఈటెల హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజలకు జవాబుదారులనే విషయాన్ని గుర్తుంచు కోవాలని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.