13 April, 2026 | 2:46 AM

రోడ్డు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

13-04-2026 01:29 AM

డీజీపీ శివధర్‌రెడ్డి

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర  డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు పోలీ సు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఆదివారం  జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన అలైవ్‌అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ హెల్మెట్ ఆకార నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యా లయంలో మొక్కలు నాటారు. భరోసా కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వీఓఏసీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.

వాంకిడి మండలంలో నిర్మిస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రం లో రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కు టుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యం గా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారే ఎక్కువగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలి పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల బారినపడి సుమారు 7,500 మంది మరణించారని చెప్పారు.

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకొని ప్రతి జిల్లాలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజ ల్లో హెల్మెట్ వినియోగం పెంచేందుకు ప్రతీకాత్మకంగా హెల్మెట్ ఆకార నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ట్రాఫి క్ నియమాలను ఖచ్చితంగా పా టిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. రాష్ట్రంలో మావో యిస్టు ప్రభావం గణనీయంగా తగ్గి ందని, ప్రస్తుతం రాష్ట్రంలో కొద్ది మంది మావోయిస్టులే ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ వహీదు ద్దీన్, సీఐలు బాలాజీ వరప్రసాద్, రమేష్, ఎస్త్స్రలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.