13 April, 2026 | 2:49 AM

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

13-04-2026 01:27 AM

సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానం

ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో తొమ్మిదో స్థానం

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రం లో తొమ్మిదో స్థానం దక్కింది.

జిల్లాలో ద్వితీ య సంవత్సరం జనరల్ విభాగంలో 1595 మంది బాలురు, 2150 మంది బాలికలు కలిపి మొత్తం 3745 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1165 మంది బాలురు, 1952 మంది బాలికలు కలిపి మొత్తం 3077 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 82.16 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. ఒకేషనల్ విభాగంలో 311 మంది బాలురు, 343 మంది బాలికలు కలిపి మొత్తం 654 మంది పరీక్షలు రాయగా, వీరిలో 257 మంది బాలురు, 319 మంది బాలికలు కలిపి మొత్తం 576 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

88.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 1990 మంది బాలురు, 2302 మంది బాలికలు కలిపి మొత్తం 4292 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1049 మంది బాలురు, 1813 మం ది బాలికలు కలిపి మొత్తం 2862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 66.68 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 345 మంది బాలురు, 409 మంది బాలికలు కలిపి మొత్తం 754 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 138 మంది బాలురు, 386 మంది బాలికలు కలిపి మొత్తం 524 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 69.50 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానాన్ని సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి మొత్తం 2669 మంది బాలురు, 4410 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి బాలికలదే పైచేయిగా నిలిచింది.

ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారు. ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన సి.హెచ్. కావేరి బైపీసీలో 971/1000, ఎం. అశ్విత ఎంపీసీలో 960/1000 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల/కళాశాలకు చెం దిన సామాల వేదాక్షర ఎంపీసీలో 960/ 1000 మార్కులు సాధించగా, అల్లే వైష్ణవీ బైపీసీలో 973/1000, మాధురి బీశ్వాస్ సీఈసీలో 955/1000, వైష్ణవీ ఎంఈసీలో 883/1000 మార్కులు సాధించారు. వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశా లకు చెందిన బి. మంగళ బైపీసీలో 954/1000 మార్కులు సాధించారు.