calender_icon.png 3 May, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి

24-04-2025 12:37:17 AM

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, ఏప్రిల్ 23 ( విజయ క్రాంతి): సంగారెడ్డి జిల్లా కంది మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో  కొత్త గా నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి  మాట్లాడుతూ జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులో ఉందన్నారు.

వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుకోవాలని, వారికి ఏకరూప దుస్తులు  పుస్తకాలుఅందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రవీంధర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.