calender_icon.png 2 May, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు,హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు

24-04-2025 12:36:32 AM

భద్రాచలం ఏఎస్‌పీ విక్రాంత్ కుమార్ సింగ్

భద్రాచలం, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) :  భద్రాచలం పట్టణంలోనూ, సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా అనుమతులు లేకుండా ఎవరైనా ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు, హోర్డింగులు కడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో కొందరు రోడ్ల పక్కన, డివైడర్లకు మధ్య ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు.   

వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ప్లెక్సీలు, హోర్డింగ్ లు తెగిపోయి ప్రమాదాలు సంభవించే ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు.  గ్రామ పంచాయతీ అధికారుల అనుమతి తీసుకున్న ప్రకారం వారు కేటాయించిన స్థలాల్లోనే ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక మీదట ఎవరైనా ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలకు, ఇతర ప్రమాదాలకు కారకులయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు .