11 April, 2026 | 8:52 PM

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు

11-04-2026 07:08 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్య ప్రసాద్, ఉపాధ్యాయుల బృందం శనివారం ర్యాలీ జరిపి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి గురించి వివరించారు. పాఠశాల వివరాలతో కూడిన పత్రికలను పంపిణీ చేసి, తమ పిల్లలను మా పాఠశాలలో చేర్పించాలని కోరారు. మా పాఠశాల అన్ని విధాలుగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా, అన్ని వసతులతో సమర్థంగా పోటీ చేసే స్థాయిలో ఉన్నదని  విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.