కామారెడ్డికి చేరుకున్న వి.హనుమంతరావు
01-06-2026 08:12 PM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు
కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి.హనుమంతరావు సోమవారం కామారెడ్డికి చేరుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గిరి హనుమంతరావుకు స్వాగతం పలికారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వి హనుమంతరావు ను పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డికి చేరుకోవడంతో వి హనుమంతరావు పలువురు కాంగ్రెస్ నేతలు కలిసి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.






