1 September, 2026 | 7:57 PM

ప్రభుత్వం సీపీఎస్‌ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

01-09-2026 | 07:14pm

టిజి ఈ-జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ సకినాల అనిల్ కుమార్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ చకినాల అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. టీజిఈ జేఏసీ రాష్ట్ర శాఖ మూడు దశల ఉద్యమ ప్రణాళిక ప్రకారం ఇది రెండవ ఉద్యమంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిపిఎస్ విద్రోహ దినంను నిరసనను టీజీఈజేఏసీ జిల్లా శాఖ అధ్యక్షులు వెంకట రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ అనిల్ కుమార్  మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సిపిఎస్ మీద ఉద్యోగులతో ఆడుకుంటున్నాయని అన్నారు. సీపీఎస్ ని రద్దు చేసి ఓపీఎస్సీని చేసినప్పుడే ఉద్యోగుల బతుకులలో సంతోషము ఉంటుందని అన్నారు. కేంద్రమే ఓపిఎస్ చట్టం చేసి ఉండి ఉంటే రాష్ట్రాలన్నీ దాన్ని అమలు చేసేవాటివి అలాకాకుండా కేంద్రం తప్పుకొని రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల సిపిఎస్ మీద అవగాహన లేని రాష్ట్రాలన్నీ కూడా సిపిఎస్ అనే కూపంలోకి  ఉద్యోగులను నెట్టడం జరిగిందన్నారు. 

ఇప్పుడు దాని పరిణామాలు ఉద్యోగులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిపిఎస్ లో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నారు. వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువగా వాళ్ళ పెన్షన్ రావడం చాలా దీనమైన స్థితి ఉన్నారన్నారు. 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ఉద్యోగికి వృద్యాప పెన్షన్ తో సమానంగా ఇవ్వడం అనేది చాలా ఘోరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తుందని తెలిపారు.  ఉద్యోగస్తులందరూ పదో తేదీన జరిగే హైదరాబాదులో మహా ధర్నాకు పెద్ద  మొత్తంలో హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకట్ రెడ్డి  మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేసేంతవరకు అదేవిధంగా ఉద్యోగుల యొక్క పిఆర్సి, 6 డిఏ  లను , పెండింగ్ బిల్లులను మంజూరు చేసేంతవరకు పోరాటం ఆపేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్  విక్టర్ , ఎన్ వై గిరి లు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ  పెన్షన్ విద్రోహ నిరసన కార్యక్రమంలో పిజిఈ జెఏసి సెక్రెటరీ జనరల్ దేవేందర్, కో చైర్మన్ ఆకుల బాబు, పంపరి ప్రవీణ్ కుమార్, రాజు,లింగం బషీర్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ నాగరాజు,ఎల్లారెడ్డి, సాయి రెడ్డి,  చక్రధర్ , కో చైర్మన్ రవీందర్ రెడ్డి,  సయ్యద్ ఖళీముద్దీన్ , చిరంజీవి, దేవరాజు,రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.