మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఐడి కార్డులు పంపిణీ
01-09-2026 | 07:28pm
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో చొప్పదండి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్(Former Market Committee Chairman Kothuri Mahesh) తన సొంత ఖర్చులతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థిని విద్యార్థులకు ఐడి కార్డ్స్ అందించారు. కొత్తూరి మహేష్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులు(Teachers) బోధించే విద్యను విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో అర్థం చేసుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, విద్యను బోధించిన ఉపాధ్యాయులకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.






