ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం
నేరేడుచర్ల, (విజయ క్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్(fee reimbursement) బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఎటువంటి ఆటంకం లేకుండా తమ విద్యను సాగించేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల ఎమ్మార్వో(MRO of Nereducherla) ఎస్. సైదులుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, ఈ బకాయిలు చెల్లించలేని దుస్థితి కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కళాశాలలో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఆపకుండా ఇచ్చేలా ఒక జీఓ ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.






