1 September, 2026 | 11:13 PM

Breaking News

రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •  

ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు

01-09-2026 | 10:16pm

నిర్మల్,(విజయక్రాంతి): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) జాబితాలో అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు తెలిపారు మంగళవారం సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ఆయన హాజరై మాట్లాడారు. ముసాయిదా జాబితాలో పేర్లు, వివరాల్లో తప్పులు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా సంబంధిత ఆధారాలతో అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చని తెలిపారు.

ఓటర్లెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. బీఎల్‌వోల ద్వారా నోటీసులు అందుకుంటున్న ఓటర్లకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.