28 June, 2026 | 2:11 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

అనుమానాస్పద స్థితిలో ప్రభుత్వ టీచర్ మృతి

10-03-2026 12:00 AM

భర్తే హత్య చేశాడంటూ మృతురాలి బంధువుల ఆరోపణ 

పిల్లల పేర ఆస్తులు రాయాలంటూ డిమాండ్ 

ఆసుపత్రి వద్ద ఉద్రుక్త వాతావరణం 

పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 9, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం  విషాదకర  ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత ఆదివారం కొత్తగూడెంలోని త్రిమాత టెంపుల్ ఏరియాలో గల తన స్వగృహంలో  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి చేరడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కవిత మృతిపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కవిత భర్త నాగేశ్వరరావుకు మరో వివాహతతో  వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని, ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఆదివారం రోజున భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని వారు తెలిపారు.

ఈ కారణంగా భర్త నాగేశ్వరరావు కవితను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న నేపథ్యంలో, కవితా, నాగేశ్వరరావు కలిగిన ఆస్తి ఆ వత్తు పిల్లల పేర్లు రాయించాలని, మృతదేహాన్ని అత్త వారే తీసుకెళ్లి దహన సంస్కరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన దిగారు. ఈ విషయంపై పోలీసులు కల్పించుకొని నిందితుడి తో మాట్లాడి ఆస్తిని పిల్లల పేర్లు రాసేందుకు అంగీకరించడంతోపాటు లాయర్ సమక్షంలో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. 

మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కవిత భద్రాచలం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా, భర్త నాగేశ్వరరావు బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.