16 May, 2026 | 2:12 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లాలి

16-05-2026 12:24 AM

ఉట్నూర్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలనలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు తీసుకు వెళ్ళేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికులుగా పనిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన వారికి దిశ నిర్దేశం చేశారు.

శుక్రవారం ఉట్లూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండల శాఖ అధ్యక్షులుగా ఎంపికైన అధ్యక్షులు, ఇంద్రవెల్లి ఉట్నూరు పట్టణ శాఖ అధ్యక్షులు గా ఎంపికైన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నూతనంగా ఎంపికైన పట్టణ శాఖ, మండల శాఖ అధ్యక్షులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లడంతో పాటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని సూచనలు చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పిటిసి సభ్యులు భారీ మెజార్టీతో గెలుపొందే విధంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించుటకు కృషి చేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మసూద్ ల తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.