16 May, 2026 | 2:11 AM

పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు

16-05-2026 12:23 AM
  1. జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు, ప్రత్యేక తనిఖీలు
  2. మంచిర్యాల డీసీపీ భాస్కర్

మంచిర్యాల, మే 15 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా పరిధిలో పశువుల అక్ర మ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీ స్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న ట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. శుక్ర వారం మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మంచిర్యా ల జిల్లా పరిధిలోని గోరక్షక్ సభ్యులతో పశువుల అక్రమ రవాణా నిరోధంపై నిర్వహించి న సమన్వయ సమావేశంలో చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పో లీస్ శాఖ చేపడుతున్న చర్యలపై డీసీపీ వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టా ల ప్రకారం ఆవులు, దూడలను వధించడం నిషేధించబడిందని పేర్కొన్నారు.

అలాగే పశువులు లేదా ఇతర మూగజీవాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిం చే సమయంలో వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, కౌస్లాటర్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

గోరక్షక్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు నిర్ధారించకుండా వాటిని పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.

ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడు తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే రామగుండం పోలీస్ కంట్రోల్ రూమ్ (8712656597), డయల్-100 లేదా సమీ ప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. పశువుల రవాణాకు సం బం ధించి వెటర్నరీ డాక్టర్ ఆమోదించిన ధ్రువపత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపా రు. అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ఏడు శాశ్వత చెక్పో స్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రధాన రహదారులతో పాటు పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి వచ్చే మార్గా ల్లో సుమారు 15 ఆకస్మిక చెక్పోస్టులు ఏర్పా టు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

చట్ట ప్రకారం పశువుల అక్రమ రవా ణాను అరికట్టడం పోలీసుల బాధ్యత మా త్రమే కాకుండా ప్రజలు, గోరక్షక్ సభ్యులందరి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. వాహనాల్లో తరలిస్తున్న పశువుల వివరాలు, వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ వివరాలు, ఫోటోలు తీసి ప్రత్యేక గ్రూపుల్లో అప్లోడ్ చేస్తున్నామని చె ప్పారు. ఈ మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపా రు. మంచిర్యాల జిల్లా పారిశ్రామిక ప్రాంతం అనేక ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, సామరస్య వాతావరణం కొనసాగించడంలో ప్రజాప్రతిని ధులు, ప్రజ లు, మీడియా మిత్రులు అందరి సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు, మంచిర్యాల రూరల్ ఇన్స్పెక్టర్ రవీందర్, లక్షెట్టిపేట్ సీఐ రమణమూర్తి, శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, మంచిర్యాల జిల్లాలోనీ ఎస్‌ఐలు పాల్గొన్నారు.