6 July, 2026 | 5:34 PM

ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం

06-07-2026 04:28 PM

కాళేశ్వరం కోసం గోదావరిలో రూ. లక్ష కోట్లు 

కేటీఆర్ వి బడాయి కబుర్లు

హైదరాబాద్: కాళేశ్వరం కోసం రూ. లక్ష కోట్ల గోదావరిలో పోశారని సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. కేటీఆర్ తప్పు ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెబుతున్నారని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ హయాంలో ఎందుకు మళ్లీ నిర్మించలేదని ప్రశ్నించారు.

కాళేశ్వరంపై(Kaleshwaram Lift Irrigation Project) ఎన్ డీఎస్ ఏ సూచనల మేరకు ముందుకెళ్తున్నామని వివరించారు. కన్నెపల్లి(Kannepalli Pump House) నీళ్లు ఎత్తిపోయకపోతే 50 వేల మందితో పంపులు ఆన్ చేస్తామంటున్నారని ఆది శ్రీనివాస్(Adi Srinivas) వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో పంప్ హౌస్ రెండు సార్లు మునిగిందని ఆరోపించారు. అన్నారం బ్యారేజ్ సాంకేతికంగా బలహీనంగా ఉందని పేర్కొన్నారు. ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం చేపట్టారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అనుమతులు లేవనే సాకుతో Tummidihatti Barrage తుమ్మిడిహట్టి వద్ద చేపట్టారని ఆయన పేర్కొన్నారు..