18 April, 2026 | 10:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్నా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

02-06-2025 10:35 PM

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Telangana State Government Whip Aleru MLA Beerla Ilaiah) పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ రిజ్వాన్  పాషా ఇతర అధికారులు పువ్వుల బొకే తో స్వాగతం పలికారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అమరవీరుల స్థూపం వద్ద పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమంపై సందేశాన్ని జనగామ జిల్లా ప్రజలకు అందజేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అధికారులకు నిర్వహించిన క్రీడా పోటీలకు సంబంధించిన బహుమతులను అందజేశారు. అదే విధంగా సీఎం కప్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అవార్డులు అందజేశారు. పలువురికి ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ఉత్తర్వులను అందజేసారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమాలను వీక్షించి వారిని అభినందించారు. ఏర్పాటు చేసి స్టాల్స్ ని వీక్షించారు.ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. సమరయోధులకు, అధికారులక దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆరు దశాబ్దాల పోరాటం, అ త్యాగాల ఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు. ప్రపంచం నలుమూలలో ఉన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా వారందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, పింకేష్ కుమార్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.