27 May, 2026 | 12:53 AM

ఎల్లమ్మ తల్లి సిద్దోగంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

27-05-2026 12:00 AM

కోనరావుపేట, మే 26 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లం వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్దోగ కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.