20-07-2025 12:25:24 AM
పూసపాటి అశోక్ గజపతి రాజు. పుట్టుకతోనే రాజుల కుటుంబంలో జన్మించిన ప్రముఖ రాజకీయవేత్త. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గజపతి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. అనంతరం ఆయన 1982లో టీడీపీ కండువా కప్పుకుని 1983, 85, 89, 94 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఎంపీగా గెలిచి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజా వారిని గోవా గవర్నర్‌గా నియమించింది.