20-07-2025 12:26:36 AM
నితీశ్ కుమార్ బీహార్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఉద్దండుడు. ఏ కూటమిలో ఉన్నా నితీశ్ సీ ఎం అవడం పక్కా. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సార్లు ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ ఈ సారి జరగబోయే ఎన్నికల్లో కూడా గెలిచి పదవ సారి పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు.
బీహార్ ముఖ్య మంత్రిగా మాత్రమే కాకుండా కేంద్రమం త్రిగా కూడా పని చేసిన అనుభవం నితీశ్ సొంతం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీహారీలకు అనేక హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు.