బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం: డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ(Nirbhaya Case) తరహా ఘటన వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో(Moving Bus) మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మే 12న జరిగిన ఘటన చోటుచేసుకుంది. నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) విమర్శలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో(Delhi BJP Government) ప్రజలకు భద్రత లేకుండాపోయిందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల ప్రకారం, ఆ మహిళ వివాహిత, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.






