1 June, 2026 | 3:28 AM

గోవిందుడు అందరివాడేలే!

01-06-2026 02:33 AM
  1. స్వామివారి దర్శనానికి 24 గంటలు క్యూ లైన్‌లో ముస్లిం కుటుంబం
  2. గోవింద.. గోవిందా నామస్మరణ

భీమదేవరపల్లి, మే 31 (విజయ క్రాంతి): గోవిందుడి నామస్మరణలో ముస్లిం కుటుంబం.. కుటుంబ సభ్యులు అంతా కలిసి శ్రీతిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ రషీద్ వారి కుటుంబ సభ్యులు శుక్రా, హసీనా బేగం, అప్సర బేగం, మహమ్మద్ తలహా బేగం తిరుపతి వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

సుమారు 24 గంటలపాటు క్యూ లైన్ లో వేచి ఉండి గోవింద గోవిందా నామ స్మరణలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపినట్లు వారు ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడించారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి దర్శనం తమకు మధురమైన అనుభూతి మిగిల్చిందన్నారు.