1 June, 2026 | 3:30 AM

కీబోర్డు సంగీతంలో విశేష ప్రతిభ

01-06-2026 02:32 AM

హైదరాబాద్ చిన్నారులకు గిన్నిస్ గుర్తింపు

హైదరాబాద్, మే 31 : హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు చిన్నారులకు గిన్నిస్ బుక్ గుర్తింపు దక్కింది. కొండాపూర్‌కు చెందిన శ్రీనివాస్, స్రవంతి దంపతుల కుమార్తె పి. జీవన శృతి , బత్తుల సురేంద్ర,తనూజ దంపతులు కుమారులు ఇస్సాక్ అభిషేక్, జోయె ల్ ఆశ్విక్  కీ బోర్డు సంగీతంలో విశేష ప్రతిభ కనబరిచారు. చిన్నవయసు నుంచే కీబోర్డు సంగీతంపై ఆసక్తి పెంచుకున్న వీరంతా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ సం గీత కార్యక్రమంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు.

గిన్నిస్ వరల్ రికార్డ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు ఏకకాలంలో సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రద ర్శనలో జీవన శృతి, అభిషేక్, ఆశ్విక్ విరా మం లేకుండా గంటకు పైగా కీబోర్డ్ వాయించడంలో అద్భుత ప్రతిభ కనబరిచారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా గిన్నిస్ అచీవర్స్ మీట్ కార్యక్రమంలో సర్టిఫికెట్ మరియు మెడల్ అందజేశారు. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు.