మొగులయ్యను ప్రభుత్వం ఆదుకోవాలి
05-05-2024 12:10 AM
కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కూలీగా మారడం దయనీయం. గత ప్రభుత్వం ఇచ్చి న హామీలు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయనకు అందడం లేదని వార్తలు వచ్చాయి. పింఛను సొమ్ము రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నార్ట. కుటుంబ పోషణ ఆయనకు తలకు మించిన భారమే. ఇబ్రహీంపట్నంలోని తుర్కయాంజాల్‌లో మండుటెండలో నిర్మా ణ పనుల్లో మొగులయ్య వుండగా కొందరు వీడియోలు తీశారని తెలుస్తున్నది. ఇకనైనా మన కళాకారుణ్ణి ప్రభుత్వం ఆదుకోవాలి.
పి. పెంటయ్య, కామారెడ్డి






