12 May, 2026 | 4:13 PM

మెట్రో రైలుతో ఎంతో మేలు

05-05-2024 12:05 AM

‘హైదరాబాద్ మెట్రో’ ప్రారంభమైనప్పట్నించీ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అంటే, ఆరున్నరేండ్లలో రైలులో ప్రయాణించిన వారి సంఖ్య మొత్తం 54 కోట్లకు చేరుకోవడం హర్షణీయం. ఈ సందర్భంగా ‘గ్రీన్‌మైల్స్ లాయల్టీ క్లబ్’ను ఆవిష్కరించినట్లు వార్తచదివాం. హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలోనే ఇది ఎంతో అరుదైన ఘనత కావడం ప్రశంసనీయం. ఐటి ఉద్యోగులతోపాటు ఇతర ప్రజలు కూడా మెట్రోను చక్కగా ఉపయోగించుకొంటున్నా రు. రోజూ సగటున అయిదున్నర లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తున్నది. ట్రాఫిక్ రద్దీ, కర్బన ఉద్ఘారాలను తగ్గిం చడంలో మెట్రో తనదైన పాత్రను పోషిస్తున్నట్టే లెక్క.

కిరణ్‌కుమార్, నాగారం