15 July, 2026 | 4:31 AM

కేసీఆర్ రాచరిక పాలన చేశారు : ప్రభుత్వ విప్ లక్ష్మణ్

04-07-2024 04:56 PM

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రభుత్వ విప్ అడ్టూరి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేసీఆర్ రాచరిక పాలన చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ అంటున్నారని ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా ఉండరని, ఆరు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రజలను రెచ్చగొడుతున్నారని అడ్టూరి లక్ష్మణ్ మండిపడ్డారు.