15 July, 2026 | 4:38 AM

అందుకోసమే ప్రధాని, హోంమంత్రిని కలిశాం: భట్టి విక్రమార్క

04-07-2024 04:55 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రిని కలిశామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామని తెలిపారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలన్నారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని, కాజీపేట రైల్వే కోస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి  కృషి చేయాలని, ప్రధానిని కోరామని వెల్లడించారు.

తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు, ప్రతి జిల్లాలో నవోదయ స్కూల్ ఏర్పాటు, విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని, ప్రధానికి విన్నవించామని భట్టి తెలిపారు. అటు తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధాని మోడీని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పి ముఖ్యమంత్రి పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.