calender_icon.png 17 February, 2026 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.5వేలకో బర్త్ సర్టిఫికెట్ అమ్మేశారు?

17-02-2026 12:49:09 AM

ఆధా(ర్)రం కోసం అడ్డదారులు 

జీపి డేటా ఎంట్రీ ఆపరేటర్ కీలకపాత్ర 

మీసేవ, ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకుల తోడ్పాటు 

చేతులు మారిన లక్షల రూపాయలు 

మహబూబాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): ఆధార్ కార్డులో దొర్లిన తప్పులను సరి చేయడానికి కొందరు అడ్డదారులు తొ క్కారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వెలుగు చూసిన తప్పుడు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విషయంపై అటు పోలీసులు ఇటు పం చాయతీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో అనేక ఆసక్తికర సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. బయ్యారం మండలంలోని నామాలపాడు, ఇరుస్లాపురం కొత్తగూడెం తదితర గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా వెయ్యి నుంచి 5 వేల రూపాయలు తీసుకొని తప్పుడు మార్గంలో డెత్, బర్త్ సర్టిఫికెట్లు అమ్మేశారు. 300కు పైగా తప్పుడు మార్గంలో బర్త్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఇటీవల పంచాయతీ అధికారులు గుర్తించారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు వినియోగించే డిజిటల్ ‘ కీ’ లను తస్కరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనితో బయ్యారం ఎస్ ఐ తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే పట్టారు. అలాగే శాఖపరమైన విచారణను డి ఎల్ పి ఓ స్వరూప నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బయ్యారం మండలంలో పంచాయతీల నుండి ఎన్ని తప్పుడు బర్త్, డెత్ స ర్టిఫికెట్లను జారీ చేసి ఉంటారనే విషయంపై సమగ్ర విచారణ నిర్వహించగా ఇతర గ్రా మాలు, ప్రాంతాల్లో జన్మించిన వారికి ఇక్కడ జన్మించినట్లు రికార్డులు తారుమారు చేసి అడ్డదారిలో సుమారు 300 వరకు తప్పుడు పత్రాలు జారీ అయినట్లు ప్రాథమికంగా గు ర్తించారు. ఇందులో అధికంగా బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్లు నిర్ధారించారు. 

ఆధార్‌లో మార్పు కోసమే..

ఎక్కువగా జారీచేసిన తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులో మార్పు కోసమే చేసి నట్లు గుర్తించారు. పిల్లలు చదువుతున్న తరగతికి, ఆధార్ కార్డులో ఉన్న వయసుకు తేడా ఉండడంతో చాలామంది తల్లిదండ్రులు త మ పిల్లల డేట్ అఫ్ బర్త్ సరి చేయించుకోవడానికి బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్, మీసేవ కేంద్రాలకు వెళ్లడం పరిపాటి. దీన్ని ఆసరాగా చేసుకున్న బయ్యారం మండలంలోని మీసే వ కేంద్రం నిర్వాహకుడు, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు, బయ్యారంలోని (ఇంటి దొంగ) డేటా ఎంట్రీ ఆపరేటర్ కుమ్మక్కై తప్పుడు బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు విచారణలో వెళ్ళడైనట్లు సమాచారం.

ఒక్కో సర్టిఫికెట్ జారీ కోసం 1000 నుంచి 5000 వరకు ఈ ముఠా సభ్యులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీపీ డేటా ఎంట్రీ ఆపరేటర్ మండల పరిషత్ పంచాయతీ అధికారి కార్యాలయంలో అప్పుడప్పుడు విధులు నిర్వహించే క్రమంలో నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ ‘కీ’లను వినియోగించే వాడని, ఆ క్రమంలో పాస్వర్డ్, లాగిన్ వివరాలను తెలుసుకోవడం వల్ల, డిజిటల్ ‘కీ’లను తస్కరించి తప్పుడు పత్రాలు జారీకి వినియోగించినట్లు గుర్తించారు.

తప్పుడు డెత్, బర్త్ సర్టిఫికెట్ల జారీ విషయంలో అటు పంచాయతీ అధికారులు శాఖ పరమైన విచారణ నిర్వహిస్తుండగా, ఇప్పటికే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి లోతుగా విచారణ నిర్వహించి, కేసు విచారణను కొలిక్కి తెచ్చారని, త్వరలో ఈ కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. తప్పుడు మార్గంలో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు చేతులు మారినట్లు ప్రచారం సాగుతోంది.