ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : ధాన్యం అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డు రాయినిగూడెంలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మేప్మా) ఆధ్వర్యంలో ఐకేపీ(2) ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకోవడం ద్వారా ఎటువంటి మోసాలు జరగవన్నారు.
అలాగే నగదు సైతం తొందరగా రైతుల ఎకౌంట్లో జమ కావడం జరుగుతుందన్నారు. కావున నాణ్యమైన ధాన్యమును కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్గురి ఇందిరా వీరయ్య, వెక్కంటి శేఖర్ రెడ్డి, కోడి నాగరాజు యాదవ్, కుంభం రాజేందర్, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుగూరి వెంకటేశం గౌడ్, కొడగండ్ల ఉపేందర్ రెడ్డి, పిండిగా విజయ్, కోడి శివ, మెప్మా కోఆర్డినేటర్ రమేష్ నాయక్ ఐకెపి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు




