ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలి
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరా రు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఇంఛార్జి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వేణు గోపాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, జిల్లా రవాణా అధికారి సంతోష్, కార్మిక శాఖ అధికారితో కలిసి సం బంధిత శాఖల అధికారులతో వరి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
రైతు సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి నిర్ణీత మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చే యడం జరుగుతుందన్నారు. ధాన్యం క్విం టాలు గ్రేడ్ ఏ రకానికి రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించిందని, సన్న రకం వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అదనంగా అందించడం జరుగుతుందన్నారు.
రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ, మూత్రశాలలు, విద్యుత్, టేబుల్, కుర్చీలు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రములో ఖచ్చితముగా 2 ఎలక్ట్రానిక్ తూకం పరికరాలు, 30 టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్ అందుబాటులో ఉంచా లని, ఒకవేళ ప్యాడి క్లీనర్ లేనిచో ట్రాక్టర్ మౌంటెడ్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేయాలన్నా రు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతు ల వద్ద నుండి వరుస ప్రకారం కొనుగోలు చేయాలని, రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని తెలిపారు.
ప్రతి సన్న రకం ధాన్యం సంచిపై ఎస్ అక్షరం, సెంటర్ కోడ్ ఎరుపు రంగుతో ఖచ్చితముగా వ్రాసిన తర్వాతనే ధాన్యం నింపాలని, బస్తాలను ఎరుపు రంగు దారంతో కుట్టాలని, దొడ్డు రకం ధాన్యం బస్తాలను ఆకుపచ్చ రంగు దారంతో కుట్టాలని, ఈ సంచులపై ఎటువంటి అక్షరాలు రాయకూడదని తెలిపారు. ధాన్యం రవాణా చేసేటప్పుడు సన్న రకం, దొడ్డు రకం ధాన్యంను వేరు వేరులారీలలో తరలించాలని తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పూర్తి భాద్యత కొనుగోలు నిర్వాహకులదేనని, కొనుగోలు జరిపిన వెంటనే సంబందిత రైతుకు కొనుగోలు పత్రం తూకం వివరాలతోఇవ్వాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభు త్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని వ్యవ సాయాధికారులు, ఏఈఓలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.




