2 June, 2026 | 12:49 PM

Breaking News

Pawan Kalyanను యాక్టర్‌గా "అభిమానిస్తాం.. రాజకీయంగా వ్యతిరేకిస్తాం''   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్   •   గ్రామ యువత ఆలం రాహుల్ ని ఆదర్శంగా తీసుకోవాలి   •   సీఎం రేవంత్ రెడ్డిపై కోవ లక్ష్మి ఫైర్   •   సఫాయి కార్మికులకు ఘన సన్మానం..   •   పవన్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్   •   అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు   •   పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •  

మహిళా అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

08-04-2026 12:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రాజాపూర్, ఏప్రిల్ 7: మహిళల అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ద్యేయమని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. మంగళవారంరాజాపూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 42 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద మరియు మధ్య తరగతి కుటుంబాల ఆడపిల్ల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేందుకు  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అర్హులైన పేదలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నయని అన్నారు.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని, ఎవరూ మధ్యవర్తుల మాటలు నమ్మకూడదని సూచించారు. ప్రజలకు మరింత సేవ చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో తాసిల్దార్ రాధాకృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ భారతి,మండల సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రామకృష్ణ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,పీ. యాదయ్య,శ్రీనివాస్ నాయక్, సుజాయ్ చంద్రారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, నాసిర్ బేగ్, శ్రీకాంత్ రెడ్డి, విజయ్, శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.