5 May, 2026 | 2:57 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

05-05-2026 01:27 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 4: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.సోమవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోళ్ల తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తేమ కొలిచే యంత్రాలు,గన్నీ బ్యాగులు,త్రాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.సకాలంలో ట్యాబ్ ఎంట్రీలు చేసి రైతులకు వెంటనే చెల్లింపులు జరపాలని స్పష్టం చేశారు.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా సజావుగా ధాన్యం సేకరణ జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీధర్ రెడ్డి,తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్,ఏపీఎం రాంబాబు,ఎస్‌ఐ సైదులు,పీఏసీఎస్ సీఈఓ వూర సత్యనారాయణ,వివిధ శాఖల అధికారులు,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.