30 March, 2026 | 11:56 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

16-05-2024 01:53 AM

కామారెడ్డి కలెక్టర్ జితేష్ వీ పాటిల్

కామారెడ్డి, మే 15 (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కామారెడి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం పౌరసరఫరాల, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలు కురుస్తున్నందున కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌ల్లో నమోదు చేయాలని సూచించారు. రైతుల నుంచి పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ పత్రాలు తీసుకుని సకాలంలో వారి ఖాతాల్లో సొమ్ము జమ చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సకాలంలో బాయిల్డ్ మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మల్లికార్జునబాబు, ఇంచార్జి జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ నిత్యానందం, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసొసియేషన్ ప్రతినిధులు లింగం, గౌరీశంకర్, భూమేష్, కృష్ణమూర్తి, రాజు, రమేష్ పాల్గొన్నారు.