30 March, 2026 | 1:26 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై నిఘా

16-05-2024 01:50 AM

గ్రేటర్ పరిధిలో దాదాపు 20 వేలకు పైగా బస్సులు

ఫిట్‌నెస్ పొందాలని యాజమాన్యాలకు ఆర్టీఏ నోటీసులు 

ప్రత్యేక దృష్టి సారించాలంటున్న పేరెంట్స్ సంఘాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి): విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బస్సులకు కచ్చితంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని విద్యాసంస్థలకు ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని విద్యాసంస్థలు నడిపించే బస్సులకు నోటీసులు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్ పొందని బస్సులపై చర్యలు చేపడతామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

20 వేలకు పైగా..  

గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 8 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 14 వేల నుంచి 15 వేల దాకా స్కూల్ బస్సులు నడుపుతున్నారు. ఇవి కాకుండా  ఇంజినీరింగ్ కళాశాలలు నడిపించే బస్సులు మరో 5 నుంచి 6 వేల దాకా ఉన్నాయి. ఇంకా ఇటీవల కాలంలో వ్యాన్‌లు అధికంగా స్కూళ్లకు విద్యార్థులను డ్రాప్ చేస్తున్నాయి. మొత్తంగా 20 వేలకు పైగా పాఠశాల, కళాశాలల బస్సులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా కూడా ఏడాది ఫిట్‌నెస్ పొందడం లేదనే విమర్శలున్నాయి. ఈ బస్సులు అత్యధికంగా రవాణా శాఖ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదంటూ, అందుకే స్కూల్ బస్సులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు అమ్యా మ్యా లకు అలవాటు పడుతున్న కారణంగానే ఈ బస్సులకు ఫిట్‌నెస్ జారీ చేసేటప్పుడు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాల నిర్వహణ సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నందున నగరంలో వీటిపై పెద్దగా తనిఖీలు జరుగుతున్న సందర్భాలు కూడా తక్కువగానే ఉంటున్నాయని విమర్శిస్తున్నారు. 

చర్యలు తప్పవు.. 

ఆర్టీఏ నిబంధనలు, సూచనలకు అనుగుణంగా విద్యాసంస్థల బస్సులు నడిపించా లని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. బస్సు డ్రైవర్ వయసు 60 ఏళ్లలోపు ఉండాలని, కచ్చితంగా హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని, అత్యవసర సమయాల్లో కిటికీలు ఓపెన్ చేసుకునేలా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివా రణ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తదితర ధృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థలకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు.