30-10-2024 01:03:31 AM
సిరిసిల్ల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశించారు. జిల్లాలో దళారుల ఆగడాలపై సోమవారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో ‘ధాన్యం కేంద్రాల్లో దళారులు పడ్డారు’ అనే శీర్షికన ప్రచురితమై న కథనంపై ఆయన స్పందించారు.
ఈమేరకు మంగళవారం జిల్లాకు చెందిన అదన పు కలెక్టర్లు, పౌరసరఫర శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.రైతులు దళారులను నమ్మి మోసపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేంద్రాల్లో రైతుల కోసం టెంట్లు, ఓఆర్‌ఎస్, తాగునీరు ఉండేలా చూడాలన్నారు. మిల్లర్లు సత్వరం ధాన్యం దిగుమతి చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మి, ఆ శాఖ మేనేజర్ రజిత, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.