22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

సమయానికి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే

10-11-2024 12:58 PM

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): సమయానికి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగుడా, మల్ శెట్టిగుడా గ్రామాల రైతులను కలిసిన కిషన్ రెడ్డి, ప్రభుత్వం వడ్ల కొనుగోలులను వెంటనే చేపట్టాలని, పండించిన రైతులకు గిట్టుబాటు ధరను అందించి, సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వద్ద నుండి వడ్లను కొనుగోలు చేయకపోతే మరో మారు రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ సత్త వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆకుల యాదగిరి, రాజ్ కుమార్, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.