18 April, 2026 | 12:25 AM

రైస్‌మిల్లులో ధాన్యం వెంటనే అన్‌లోడ్ చేయాలి

31-10-2025 01:56 AM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

మల్కపేట కొనుగోలు కేంద్రం తనిఖీ

కొండాపూర్ లో లెవెల్ కల్వర్టుకు మరమ్మత్తు చేయాలి

వెంకట్రావుపేట చెరువు పరిశీలన

కోనరావుపేట, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లులో అన్ లోడ్ చేసుకో వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆ దేశించారు. కోనరావుపేట మండలం మల్క పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వడ్ల కుప్పలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అందుబాటులో ఉండాలని, అన్ని వసతులు కల్పించాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైస్ మి ల్లులకు తరలించాలని ఆదేశించారు.

రైస్ మి ల్లర్ తో స్వయంగా ఫోన్లో మాట్లాడి కొను గోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఆప కుండా వెంటనే అన్ లోడ్ చేయాలని సూచించారు. కొండాపూర్ గ్రామ శివా రులో గల లో లెవెల్ కల్వర్టుకు మరమ్మత్తు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వర్షా నికి పెంటివాగు ప్రవహించి కొండాపూర్ లో లెవెల్ కల్వర్టు దెబ్బతినగా, గురువారం ఇం చార్జి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కల్వర్టుకు పక్కాగా మరమ్మత్తులు పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.

వెంకట్రావుపేట చెరువు పరిశీలన

వెంకట్రావుపేటలోని గద్దె గుట్ట చెరువు లీకేజీ కాగా,ఇంచార్జి కలెక్టర్ అధికారులతో క లిసి కాలినడకన వెళ్లి పరిశీలించారు. చెరువు సామర్థ్యం, పరివాహక ప్రాంతం ఇతర వివ రాలు నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రవహిస్తున్న వరద కాలువను దాటి చెరువు కట్ట మీదికి వెళ్లి పరిశీలించారు.  కట్టకు ప్రమాదం లేకుండా స్లూయిజ్ గేట్లు, మత్తడి ద్వారా వరద ప్రవాహాన్ని కింద ఉన్న కేశవరావు చెరువుకు పంపిస్తున్నట్లు అధికారులు ఇంచార్జి కలెక్టర్ కు వివరించారు. నీటి సామర్థ్యం తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో లీకేజీ కి మరమ్మ త్తులు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. 

వారితో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిషోర్ కుమార్,ఆర్&బి ఈఈ నరసింహ చారి, జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్ర ప్రకాష్, ఆర్&బి డీఈ శాంతయ్య, నీటి పారుదల శాఖ డీఈ క్రాంతి కుమార్, ఎంపీడీఓ,స్నిగ్ధ తహసీల్దార్ వరలక్ష్మి, ఏఇఒ రమేష్ తదితరులు పాల్గొన్నారు.